18th November Horoscope : నేటి రాశి ఫలాలు
18th November Horoscope : మేష రాశి వారికి ఒక విషయంపై తర్జనభర్జన పడతారు. ఫలితం అనుకూలంగానే ఉంటుంది. అవకాశాలు అందుకుంటారు. మిత్రుల సాయం ఉంటుంది. శివుడిని ధ్యానించడం ఉత్తమం.
వ్రషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. పనుల్లో ఆటంకం లేకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు వెళ్లాలి. లక్ష్మీదేవిని కొలవడం మంచిది.
మిథున రాశి వారికి ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. గొడవలకు వెళ్లడం సురక్షితం కాదు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం మేలు.
కర్కాటక రాశి వారికి చేపట్టే పనుల్లో విజయం దక్కుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ ధర్మమే మీకు అండగా ఉంటుంది. సూర్యుడిని పూజించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. సొంతింటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సూర్యుడిని కొలవడం మంచి చేస్తుంది.
కన్య రాశి వారికి అలసట లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
తుల రాశి వారికి శుభవార్తలు వింటారు. అవసరానికి సాయం చేస్తారు. చేపట్టే పనుల్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. శని శ్లోకం చదవడం మంచిది.
వ్రశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. అధికారుల అండ ఉంటుంది. కీలక విషయాల్లో మంచి ఫలితాలొస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల బాగుంటుంది.
ధనస్సు రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. శత్రువులను తక్కువగా అంచనా వేయకండి. అవసరానికి సాయం చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం మేలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి విరోధుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆనందంగా గడుపుతారు. సాహసమైన కార్యక్రమాలు చేపడతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభంగా ఉంటుంది.
కుంభ రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. గొడవలకు దూరంగా ఉండాలి. అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.
మీన రాశి వారికి ఒక శుభవార్త మానసిక బలాన్ని పెంచుతుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.