17th November Horoscope : నేటి రాశి ఫలాలు

17th November Horoscope

17th November Horoscope

17th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి ఉంటారు. చేపట్టే పనుల్లో తడబాటు లేకుండా చూసుకోవాలి. అనవసర కోపాలకు పోకండి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

వ్రషభ రాశి వారికి మానసికంగా కుంగిపోవద్దు. ఆందోళన చెందవద్దు. అనవసర విషయాలను పట్టించుకోవద్దు. దుర్గా స్తోత్రం చదవడం శ్రేయస్కరం.

మిథున రాశి వారికి పనుల్లో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి. ప్రయాణాల్లో నిర్లక్ష్యం వద్దు. ఇష్టదేవతారాధన మేలు కలిగిస్తుంది.

కర్కాటక రాశి వారికి శత్రువులపై పైచేయి సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాల వైపు అడుగులు వేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది.

సింహ రాశి వారికి ప్రశంసలు దక్కుతాయి. సహకారం లభిస్తుంది. చేపట్టే పనుల్లో ధైర్యంగా ముందుకు వెళతారు. సూర్యాష్టకం చదవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

కన్య రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అందరిని నమ్మకూడదు. సూర్య నమస్కారం చేయడం వల్ల విశ్వాసం పెరుగుతుంది.

తుల రాశి వారికి మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు. అందరి ప్రశంసలు పొందుతారు. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం మంచిది.

వ్రశ్చిక రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. చేసే పనుల్లో వెనకడుగు వద్దు. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు. దుర్గా అష్టోత్తరం చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ధనస్సు రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పనుల్లో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

మకర రాశి వారికి కీలక బాధ్యతలు తీసుకుంటారు. ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. శివారాధన శుభప్రదంగా ఉంటుంది.

కుంభ రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి. శివారాధన మేలు కలిగిస్తుంది.

మీన రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఆంజనేయుడి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

TAGS