15th November Horoscope : నేటి రాశి ఫలాలు

15th November Horoscope

15th November Horoscope

15th November Horoscope : మేష రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. శ్రమతో విజయాలుంటాయి. చేసే పనుల్లో నిర్లక్ష్యం వద్దు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.

వ్రషభ రాశి వారికి ఒక వార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మేలు.

మిథున రాశి వారికి ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకెళతారు. ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఇష్టదేవతారాధన శుభం కలిగిస్తుంది.

సింహ రాశి వారికి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అపోహలకు తావివ్వకండి. ఈశ్వర ఆరాధన మేలు చేస్తుంది.

కన్య రాశి వారికి సానుకూల ఫలితాలున్నాయి. గొడవలకు వెళ్లకండి. సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

తుల రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం చాలా మంచిది.

వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మికత వైపు చూస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం శుభం.

ధనస్సు రాశి వారికి చేసే పనుల్లో వేగం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సంకల్పం తీరుతుంది. దైవారాధన మరింత మేలు చేస్తుంది.

మకర రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. చేసే పనుల్లో విజయాలు అందుకుంటారు. విష్ణు నామస్మరణ మంచి చేస్తుంది.

కుంభ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న ఫలితాలు దక్కుతాయి. సంతోషంగా ఉంటారు. సూర్యభగవానుడిని పూజించడం శ్రేయస్కరం.

మీన రాశి వారికి ఉద్యోగంలో మంచి స్థితి కలుగుతుంది. సాయం చేసే వారున్నారు. వ్యాపారంలో లాభాలుంటాయి. శివారాధన చేయడం చాలా మంచిది.

TAGS