Ex-MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే కొడుకు కోసం 15 మందిని బలిపశువులు చేశారు..
Ex-MLA Shakeel : తెలంగాణలో రాజకీయాలు అన్నింటిని శాసిస్తుంటాయి. వారు నేరం చేసినా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా గడ్డి తింటారు. ఎంతటి అక్రమాలకైనా పాల్పడతారు. దీంతో అడ్డదారులు తొక్కుతారు. చేసిన పాపం నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతుంటారు. తన కోసం ఎంతో మందిని బలిపశువులను చేస్తుంటారు. తాము చేసిన తప్పులకు ఇతరులను బాధ్యులను చేస్తుంటారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరగగానే ట్రాఫిక్ పోలీసులు రహీల్ తో పాటు మరో ముగ్గురు యువతులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కానీ కేసు అక్కడే మలుపులు తిరిగింది. తన కొడుకును రక్షించుకునేందుకు షకీల్ అడ్డదారులు తొక్కారు.
ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు నమోదు చేయడం గమనార్హం. మనదేశంలో నేరం చేసిన వారికంటే ఇతరులను బలి చేయడమే ఎక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఎమ్మెల్యే అయినంత మాత్రాన కేసును పక్కదారి పట్టించడం సరైంది కాదనే విమర్శలు వస్తున్నాయి.
ఇలా కేసును మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసులో ప్రధాన ముద్దాయి అయినా అతడి పేరును పక్కకు పెట్టి ఇతరులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం. తన కొడుకును సేవ్ చేసే ఉద్దేశంతో కేసుతో సంబంధం లేని వారిని ఇరికించడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇలాంటి వ్యవహారాలు చూస్తే చట్టంపై నమ్మకం పోతోంది.
పాశ్చాత్య దేశాల్లో చట్టాలకు ఎంతో విలువ ఉంటుంది. ఇక్కడ మాత్రం రాజకీయ నాయకులు అయితే చాలు ఏదైనా చేయొచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యే తన కొడుకు కోసం ఇంత బరితెగించడమే వివాదాస్పదంగా మారుతోంది. చట్టంపై గౌరవం పోయేలా చేస్తోంది.