Maldives : ఇటీవల కాలంలో మాల్దీవులు మన దేశంతో శత్రుత్వం పెట్టుకుంటోంది. మనం ఇచ్చే డబ్బుతో బతికే ఆ చిన్న దేశం మన మీదే ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మనదేశంలోని లక్ష్యద్వీప్ ను పర్యాటక కేంద్రంగా వినియోగించుకోవాలని ప్రధాని చేసిన ప్రకటన మాల్దీవుల్లో అలజడికి కారణమైంది. దీంతో భారత్ పరిశుభ్రతపై మాల్దీవుల మంత్రుల ప్రకటనతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.
జనవరి 17న మాల్దీవులకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కానీ అతడికి వైద్యం సరైన సమయంలో అందక చనిపోయాడు. మన దేశం వారికి అత్యవసర వైద్య సేవల కోసం ఓ విమానం అందించింది. ఆ విమానంలో బాలుడిని రాజధాని మాలెకు పంపిస్తే ప్రాణాలతో బయటపడేవాడు. కానీ వారు ఆ పని చేయలేదు. దీంతో అతడి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.
అదే దేశానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విమానంలో దాదాపు 16 గంటలు ఆలస్యంగా తరలించడంతో అప్పటికే బాలుడి ప్రాణాలు పోయాయి. మన దేశం ఇచ్చిన విమానంలో అతడిని వైద్యానికి పంపించి ఉంటే ప్రాణాలు దక్కేవి. ఇలా మొండికి పోయి ఓ బాలుడి మరణానికి కారకులైన ఆ దేశ అధ్యక్షుడి మీద విమర్శలు వస్తున్నాయి.
మనదేశం డోర్నియర్ అనే విమానాన్ని అత్యవసర సమయాల్లో వాడుకోవాలని అందజేసింది. కానీ మల్దీవుల ప్రభుత్వం ఆ విమానాన్ని వాడుకోవడానికి అనుమతించలేదు. బాలుడికి వైద్యం అందించడం ఆలస్యం జరిగింది. ఆ దేశంలోని ప్రైవేటు సంస్థ అసందా విమానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ ఆ విమానంలో సాంకేతిక లోపం వల్ల సరైన సమయంలో వైద్యం అందక బాలుడి ఊపిరి పోయింది.
మాల్దీవులు అనేక దీవుల సముదాయం కావడంతో అత్యవసర సమయాల్లో వైద్య సేవలకు మాలె వెళ్లాల్సిందే. అక్కడకు చేరుకోవాలంటే సరైన సదుపాయాలు లేకపోవడంతో విమానమే దిక్కు. కానీ ఆ దేశం మన విమానం వాడుకోవడానికి ససేమిరా అనడంతో బాలుడి ఆయుష్షు తీరిపోయింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఓ బాలుడు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏదైనా ఉంటే తేల్చుకోవాలి కానీ ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటం మాల్దీవుల మొండితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత్ అందించిన విమానం సేవలను వినియోగించుకోకుండా ఓ బాలుడిని నిలువునా ప్రాణాలు తీశారు. దీంతో మన దేశం మీద వారికి ఎంత ఆగ్రహం ఉందో అర్థమవుతోంది. మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను మనం డెవలప్ చేసుకోవద్దా? అలా చేసుకుంటే వారికేం మంట.
మన సంపదను మనం పెంచుకోవడానికి పాటుపడాల్సిన అవసరం లేదా? మాల్దీవుల మంత్రుల కుట్రల వల్ల ఇప్పుడు ఆ దేశమే భారీ మూల్యం చెల్లించుకుంటోంది. దీనికి మాల్దీవుల ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. పసివాడి ప్రాణం తీసిన వారిని క్షమించకూడదనే వాదనలు వస్తున్నాయి.