13th November Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. మనసుకు బాధ కలగకుండా చూసుకోవాలి. శివారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
వ్రషభ రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.
మిథున రాశి వారికి కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. ధైర్యంతో ముందడుగు వేస్తారు. దుర్గారాధన మంచి ఫలితాలు కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంది. ధైర్యంగా ముందుకు వెళతారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దుర్గారాధన శుభాలు ఇస్తుంది.
సింహ రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మేలు కలుగుతుంది.
కన్య రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. మంచి ఫలితాలు రావడానికి వేచి ఉండాలి. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.
తుల రాశి వారికి మనసుకు బాధ కలిగించే సంఘటనలుంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడిని పూజించడం చాలా మంచిది.
వ్రశ్చిక రాశి వారికి పట్టుదలతో ముందడుగు వేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చొద్దు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. లక్ష్మీ ధ్యానం అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి వారికి విజయాలు దక్కుతాయి. సలహాలు, సూచనలు పాటించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆంజనేయ స్వామి దర్శనం శుభాలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి ఉత్సాహంతో ఉంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రశాంతంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. వెంకటేశ్వర స్వామిని కొలవడం శ్రేయస్కరం.
కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మీన రాశి వారికి భవిష్యత్ ను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పనులు వాయిదా వేయొద్దు. సమస్యలు ఎదురైనా తట్టుకుంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.