poisoned : మానవ బంధాలు రోజు రోజుకు మసకబారుతున్నాయి. బంధాలు, బంధుత్వాలను అస్సలు పట్టించుకోవడం లేదు. తన స్వేచ్ఛ, తన స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. గతంలో ఇలాంటి కొన్ని ఘటనలు కనిపించినా.. పాకిస్థాన్ లో కనిపించిన ఘటన మాత్రం అత్యంత ఘోరం. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో ఒక యువతి ఆమె తల్లిదండ్రులు, 13 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఆమె ఒక యువకుడిని ప్రేమించింది. ప్రేమికుడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో వారు తినే ఆహారంలో విషం కలిపింది. దీంతో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఇందులో ప్రియుడి ప్రమేయం ఎంత వరకు ఉందో అని తెలుసుకుంటున్నారు. ప్రియుడితో వివాహం చేయకపోవడమే ఈ ఘటనకు కారణం అని అధికారులు స్పష్టంగా చెప్పారు. గోదుమల్లో విషం కలిపి రొట్టెలు చేసి ఇంట్లో అందరికీ పెట్టింది. వారు అనారోగ్యం పాలవడంతో హస్పిటల్ కు తీసుకెళ్లారు. వారి రక్తనమూనాల్లో విషం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అమెను అరెస్ట్ చేశారు.