12th November horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదవడం మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ రాశి వారికి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభాలు కలిగిస్తాయి. ఆర్థిక లాభాలున్నాయి. శివనామ స్మరణ ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది.
మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. గురు, శని ధ్యానం చేయడం శుభకరం.
కర్కాటక రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్నది సాధిస్తారు. సంతోషంగా గడుపుతారు. విష్ణు నామం స్మరించడం మంచిది.
సింహ రాశి వారికి కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాల్లో మంచి ఫలితాలున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. అనుకూల పరిస్థితులున్నాయి. శివారాధన శుభం కలిగిస్తుంది.
కన్య రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. బంధువుల వల్ల మంచి జరుగుతుంది. చంద్రశేఖర అష్టకం చదవడం మేలు చేస్తుంది.
తుల రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. మనసు చంచలం కాకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.
వ్రశ్చిక రాశి వారికి మనోధైర్యంతో ఉంటారు. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు కలిగిస్తుంది.
ధనస్సు రాశి వారికి ప్రయాణాల్లో అనుకూలంగా ఉంటుంది. అందరి ప్రశంసలు పొందుతారు. తోటి వారి సహకారాలు దక్కుతాయి. వినాయకుడిని ఆరాధించడం మేలు చేస్తుంది.
మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఒత్తిడి ఉన్నా అధిగమిస్తారు. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభకరం.
కుంభ రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. ఎవరితో గొడవలకు వెళ్లడం మంచిది కాదు. సంతోషంగా గడుపుతారు. గణపతి ఆరాధన మంచి ఫలితాలు తెస్తుంది.
మీన రాశి వారికి పనికి తగిన గుర్తింపు ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. ఎవరితోనూ గొడవలకు దిగడం సురక్షితం కాదు. ఇష్టదేవతారాధన మంచిది.