JAISW News Telugu

12th Fail Movie : ఓటీటీలో ‘12th ఫెయిల్’ దూకుడు.. చూసిన వారే మళ్లీ మళ్లీ..

12th Fail Movie

12th Fail Movie in OTT

12th Fail Movie in OTT: ఐఏఎస్, ఐపీఎస్.. ఇవి దేశంలోని లక్షలాది యువతకు కలల ఉద్యోగాలు. ప్రైవేట్ కొలువుల్లో లక్షల జీతం వస్తున్నా వదిలేసి వచ్చి మరీ సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటారు.  కొందరు ఫస్ట్ అటెంప్ట్ లోనే విజయం సాధించి ఔరా అనిపిస్తే.. మరికొందరు చివరి అటెంప్ట్ లో సాధిస్తారు. ఇంకొందరు తమ లక్ష్యం నెరవేరకుండానే మిగిలిపోతారు. అయినా సివిల్స్ అంటేనే ఓ ఉత్తేజం.. అదే ఆశగా బతుకుతుంటారు నిరుద్యోగులు. వస్తే ఉద్యోగం.. లేకుండా ఆపార విజ్ఞానం, అనుభవం. కలెక్టర్ , ఎస్పీ లాంటి జిల్లా బాస్ పోస్టులను పేద, ధనిక అనే తేడా లేకుండా సాధిస్తుంటారు.  అహర్నిషలు అదే ధ్యాసగా, ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. గుండెల నిండా కసితో చదివితే పేదవాడికైనా సివిల్స్ సాధ్యమే అని ఎందరో నిరూపించారు.

అలాంటి వారిలో ఐపీఎస్ మనోజ్ శర్మ ఒకరు. ఈయనది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరెనా జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పోలీస్ కావాలని చిన్న నాటి నుంచి కలలు కంటాడు. అయితే ఆయన ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగలేదు. చదువు సరిగ్గా అబ్బలేదు. టెన్త్ లో థర్డ్ క్లాస్ లో పాసైతాడు. ఇంటర్ లో హిందీ తప్పా అని ఫెయిలయ్యాడు. అయినా తాను ఐపీఎస్ కావాలనుకుని రోజుకూ 15గంటలు పనిచేసుకుంటూ..3 గంటలు మాత్రమే నిద్రపోతూ మిగిలిన సమయంలో చదివాడు. చివరకు సివిల్స్ లో జాతీయ స్థాయిలో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యాడు.

కటిక పేదరికం నుంచి వచ్చిన మనోజ్ శర్మకు చిన్ననాటి క్లాస్ మేట్ శ్రద్ధ..అతడికి అన్నివిధాలా అండగా నిలబడింది. మనోజ్ సివిల్స్ ప్రయాణంలో సాయం చేసింది. చివరకు నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఆ తర్వాత శ్రద్ధనే ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ముంబై పోలీస్ శాఖలో అదనపు కమిషనర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

మనోజ్ సక్సెస్ స్టోరీపై వచ్చిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా ఇటీవల రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓటీటీలో ఈ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. ఇటీవలే టాప్-250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ మూవీ.. తాజాగా ఐఎంబీడీలో 10కి 9.2 రేటింగ్ తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యానిమేటెడ్ మూవీ రామాయణ, నాయకుడు, గోల్ మాల్ మూవీస్ ఉన్నాయి. ట్వెల్త్ ఫెయిల్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

దేశంలో సివిల్స్ ప్రిపరేషన్ తో పాటు వివిధ ఉద్యోగాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు. వారందరికీ ఈ సినిమా మోటివేషన్ కల్పిస్తోందని చెప్పాలి. సినిమాను విద్యార్థులే కాకుండా పేరెంట్స్ కూడా తమ పిల్లలకు చూపిస్తున్నారు. రియల్ స్టోరీ కావడంతో అందరిలో గొప్ప ఉత్తేజితాన్ని అందిస్తోంది. ఈ మూవీకి ఇప్పుడిప్పుడే ప్రచారం వస్తోంది. ఇది మరింత పెరిగి సివిల్స్, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఓ మోటివేషనల్ మూవీగా ఫస్ట్ చాయిస్ కానుంది.

Exit mobile version