Varun Tej : కథల ఎంపికలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా కుటుంబం కంటే భిన్నంగా వ్యవహరిస్తాడు. ఆయన ఒక్కో మూవీ ఒక్కో విధంగా ఉంటుంది. ఫిదా చేసిన వరుణ్ తేజ్ తొలిప్రేమ చేశాడు. రెండు ప్రేమ ఇతి వృత్తంగా సాగాయి. ఆ తర్వాత గడ్డలకొండ గణేశ్ రౌడీషీటర్ గా, ఆ తర్వాత అంతరిక్షం సైంటిస్ట్ గా ఒక్కోటి ఒక్కో జానర్ లో సాగుతుంది వరుణ్ తేజ్ సినిమా. పైగా అన్ని కూడా అన్ని కూడా బాక్సాఫీస్ హిట్లుగా నిలిచినవే కావడం మరో విశేషం.
కెరీర్ మొదలైనప్పటి నుంచి కథనే నమ్ముకొని ప్రయాణం కొనసాగించాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలో కొన్ని ప్రయోగాలు చేశాడు.. ఎదురు దెబ్బలు తిన్నాడు. గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వరుణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. మూడు సినిమాలు ఆర్థికంగా భారీ నష్టాలను మిగిల్చాయి. వీటి దెబ్బతో ఇప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు వరుణ్. ఈ మధ్య వరుణ్ ఏకంగా 12 కథలను పక్కన పెట్టాడట. పైగా అన్నీ కూడా పెద్ద పెద్ద బ్యానర్ నుంచి వచ్చినవి.
అయితే అందరిలా తన స్వార్థమే చూసుకోకుండా కథలో కొత్తదనం ఎంత ఉంటుందో కమర్షియల్ గా కూడా అంతే సక్సెస్ కావాలని ఆయన దర్శకులకు, నిర్మాతలకు చెప్తుంటారు. కొత్తదనం కావాలని ఎడా పెడా ప్రయోగాలు చేయద్దని, ప్రేక్షకులకు వీలైనంత ఎక్కువ వినోదం పంచితేనే నిర్మాతలకు నాలుగు డబ్బులు మిగులుతాయని అంటుంటారు. అందుకే వినోదాన్ని అందించే కథలకే పెద్దపీట వేయాలని భావిస్తున్నాడట.
నిజానికి వరుణ్ తేజ్ తీసుకున్నది మంచి నిర్ణయమే. ఇంత వరకూ వరుణ్ తనకు నచ్చిన సినిమాలే చేసుకుంటూ వెళ్లాడు. ఇప్పుడు బాక్సాఫీస్ కు ఏం కావాలో ఆలోచిస్తున్నాడు. వరుణ్ చేతిలో ప్రస్తుతం ఉన్న ‘మట్కా’ కమర్షియల్ గా వెయిటేజ్ ఉన్న సినిమా అని చెప్పకనే చెప్తున్నట్లు ఉన్నాడు. ఇందులో మరింత మసాలా దట్టించేందుకు దర్శకుడు కరుణ కుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నాడట.