JAISW News Telugu

AP Pensions : ఏపీలో జులై 1 నుంచి పెన్షన్ తో పాటు మరో 12 వస్తువులు

AP Pensions

AP Pensions

AP Pensions : జులై 1 నుంచి పెన్షన్ తో పాటు మరో 12 వస్తువులను ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1న పెంచిన పెన్షన్ లను ఇస్తామని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పారు.

గతంలో ప్రభుత్వం అందించిన ఇళ్ల పట్టాలు సగంలో అగిపోయిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి 10 నుంచి 12 వస్తువులను త్వరలోనే ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ వస్తువులతో ఇల్లు కట్టుకోవలసి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వమే ఆ ఇళ్లను ఆరు నెలల్లో నిర్మించి ఇస్తుందని మంత్రి వెల్లడించారు.

రూ. 3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారు. అలాగే మూడు నెలల బకాయిలు కలిపి రూ. 7 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. పింఛన్ల పంపిణీకు వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version