MP Nominations : కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల్లో 116 నామినేషన్లు

MP Nominations
MP Nominations : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ లోక్ సభ స్థానానికి 53 మంది, పెద్దపల్లి స్థానానికి 63 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు గురువారం ఎక్కువ మంది అభ్యర్థులు కలెక్టరేట్ వద్ద బారులుదీరారు. కరీంనగర్ స్థానానికి ఒక్కరోజే 23 మంది, పెద్దపల్లి స్థానానికి 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో 53 మంది అభ్యర్థుల్లో 94 నామినేషన్లు వేశారు. పెద్దపల్లి లోక్ సభ స్థానానికి 63 మంది 109 నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు.