AP Surveys : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి మొదలైంది. మొదటి ఫేజ్ కింద ఈ రోజు ప్రచారం ముగిసి ఏప్రిల్ 19వ తేదీ పోలింగ్ జరగనుంది. దేశంలో మొత్తం 102 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ తో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు దక్కించుకుంటుందనే విషయంపై మీడియా సంస్థలతో పాటు పలు ప్రైవేట్ వ్యక్తులు జోరుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏబీపీ సీ-ఓటర్ సర్వే ఏపీలో మహా కూటమి బీజేపీ+జనసేన+టీడీపీకి పట్టం కట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గానూ ఎన్డీఏ కూటమి 20 స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది.
అధికార పార్టీ వైసీపీ కేవలం ఐదు స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమికి 47 శాతం ఓట్లు, వైసీపీకి 40 శాతం, కాంగ్రెస్ కు 2 శాతం, ఇతరులకు 11 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెప్పింది. గత ఎన్నికల్లో 22 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 17 స్థానాలు కోల్పోతుందని ఏబీపీ సీ-ఓటర్ సర్వేలో తేటతెల్లం చేసింది. అంతేకాదు, ఈ సర్వేతో పాటు మరో 10 సర్వే సంస్థలు ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పాయి. ఇండియా టుడే సర్వేలో కూటమికి 17 సీట్లు, వైసీపీకి 8 సీట్లు వస్తాయని చెప్పింది.
సీఎన్ఎన్ న్యూస్ సర్వేలో కూటమికి 18 సీట్లు, వైసీపీకి 7 సీట్లు, ఇండియా టీవీ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8, న్యూస్ ఎక్స్ కూటమికి 18, వైసీపీకి 7, జన్మత్ పోల్స్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కూటమికి 23, వైసీపీకి 2, పీపుల్స్ కూటమికి 23 వైసీపీకి 2, పయనీర్ పోల్ కూటమికి 18, వైసీపీకి 7.. ఇండియా న్యూస్ కూటమికి 18, వైసీపీ 7, జీ న్యూస్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు దక్కబోతున్నాయని వివిధ సర్వేలల్లో తేలింది. ఈ 11 సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి విజయం దుందుభి మోగిస్తుందని అంచనా వేస్తున్నాయి.