TDP-YCP Surveys : ప్రతి పక్షంలో టీడీపీకి 11 సర్వేలు.. మరి పాలక పక్షం వైసీపీకి ఎన్ని?

TDP-YCP Surveys

TDP-YCP Surveys

TDP-YCP Surveys : ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులు, కార్యకర్తలు ఏ మేరకు హడావుడి చేస్తారో.. సర్వే సంస్థలు కూడా అంతకు తక్కువ కాకుండా హడావుడి చేస్తాయి.  అయితే ఓటర్లు సర్వేలను నమ్మి ఓట్లు వేస్తారా? అలా అయితే ప్రతీ వారూ పెయిడ్ సర్వేలు చేయించుకొని గెలుస్తారు. సర్వేలు అనేవి గెలుపునకు దగ్గరి రూటు అని అంటున్నారు. మా పార్టీ గెలుస్తుందని ఇన్ని సర్వేలు చెబితే మా పార్టీకి అంతకంటే ఎక్కువ అని మరో పార్టీ అంటోంది.

ఓటర్ల వద్దకు వెళ్లి తాము ఏం చేశాం? ఏం చేయబోతున్నాం? అని చెప్పి ఓట్లు అడగడం అటుంచి సర్వేలు మాకు అనుకూలం అని చెప్పుకోవడం దివాళాకోరుతనమే రాజకీయమే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లా సభలో చంద్రబాబు మాట్లాడుతూ కూటమికి అనుకూలంగా 11 సర్వేలు వచ్చాయని నెంబర్ తో సహా ఓటర్లకు చెప్పారు. మేము గెలవబోతున్నాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు చాలా సర్వేలు వచ్చాయి. 11 సర్వేలు వస్తే ఆ 11 సర్వేల్లో 17 నుంచి 23 ఎంపీ స్థానాలు టీడీపీనే గెలుస్తుందంటూ వచ్చిందని బాబు గుర్తు చేశారు. మళ్లీ పోలింగ్ తర్వాతే సర్వేలు ఉంటాయని చెప్తున్నారు. ఏపీలో రాజకీయం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉందని చంద్రబాబు చెప్పారు.

టీడీపీకి 11 సర్వేలు అనుకూలం అని బాబు చెప్పడం కాదు టీడీపీ తన అఫీషియల్ ఎక్స్ లో కూడా పెట్టింది. దీనిపై వైసీపీ ట్వీట్ చేస్తూ అవన్నీ తప్పుడు సర్వేలు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఎక్కువ సర్వేలు మాకే అనుకూలం అని చెప్తున్నాయి అంటూ వైసీపీ కూడా చెప్తోంది. తామే మళ్లీ అధికారం చేపట్టబోతున్నామని వైసీపీ అంటోంది.

సర్వేలతోనే పార్టీలు నెగ్గుతాయా? అన్నది అతిపెద్ద ప్రశ్న. అదే జరిగితే పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని అనేక సర్వేలు చెప్పాయి. కానీ అంచనాలు తప్పయ్యాయి. కర్ణాటకలో బీజేపీ గెలుస్తుందని సర్వేలు వచ్చినా ప్రతిపక్షంలో ఉంది. మొత్తం 4 కోట్లకు పైగా ఓటర్లున్నారు. సర్వే సంస్థలు అతి పెద్ద శాంపిల్స్ అని తీసుకుంటే లక్షా 50 వేలు స్టేట్ అంతా చూస్తే కనిపించడం లేదు.

మరి ఈ శాంపిల్స్ తో జనాల మూడ్ గ్రాబ్ చేయగలరా అన్నది మరో చిక్కు ప్రశ్న. సర్వేల వల్ల కొంత అంచనాకు రావచ్చు. కానీ అదే నిజమని నమ్మలేం. అలాగని ప్రతీ సర్వే నిజం కాదు. రాను రాను పార్టీలు వన్ సైడెడ్ సర్వేలు చేయించుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలు ఒక పార్టీకి అనుకూలంగా చేస్తున్నాదని విమర్శలున్నాయి.

సర్వేలను పట్టుకొని గెలుస్తున్నామని అంటే రిజల్ట్ వచ్చి అభాసుపాలు కాక తప్పదు. వైసీపీ అయినా టీడీపీ అయినా సర్వేలను నమ్ముకొని రాజకీయాలు చేయడం కంటే జనాలను నమ్ముకోవడం బెటర్ అంటున్నారు. మేమే గెలుస్తున్నామని అంటే రెండు పార్టీల్లో నేతలు ఇప్పటి నుంచే పని చేయడం మానేస్తే అసలుకే ఎసరస్తుందని గుర్తించాలని అంటున్నారు. 

TAGS