Viral Video : తోకలో 11 ఈకలు.. జగన్ పార్టీని కోడితో పోలుస్తూ వీడియో వైరల్..

Viral Video
Viral Video : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై మీమ్స్ ఆగడం లేదు. వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ నవ్వించే పోస్టులు షేర్ చేస్తున్నారు. ఒక వీడియోను తీసుకొని దానికి జగన్ కు అన్వయిస్తూ షేర్ చేయడం చూస్తుంటే నవ్వస్తోంది. వైరల్ రాయుళ్ల బ్రెయిన్ ఎంత గొప్పగా పని చేస్తుందో వీటిని చూస్తుంటే అర్థం అవుతుంది.
వైఎస్ జగన్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేక ఎదుర్కొన్నాడు. అందుకే అత్యంత తక్కువ సీట్లకు (కేవలం 11 మాత్రమే) పరిమితమయ్యాడు. ఎంత తక్కువ అంటే మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందా? అన్నంతగా. ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో మీటింగులు పెట్టి మరీ ఓటమిపై విశ్లేషణలు మళ్లీ ఐదేళ్ల వరకు కార్యాచరణ లాంటివి పెడుతున్నారట. సీఎంగా ఉన్న సమయంలో జగన్ అంటే అపోజిట్ పార్టీ నాయకులకే కాదు.. ప్రజలకు కూడా భయం ఉండేది. ఎంతలా అంటే ఆయన ఎన్ని పథకాలు తెచ్చినా సరే ఆయనకు దూరంగా వెళ్లేంతగా.
ఒక కోడితో వైఎస్ కాంగ్రెస్ ను పోలుస్తూ పోస్ట్ చేసిన ఈ వీడియో చూడండి నవ్వాపుకోలేరు. శరీరంపై ఎక్కడా ఒక్క ఈక కూడా లేదు. కానీ తోక భాగంలో మాత్రం కొన్ని ఈకలు ఉన్నాయి. ప్రస్తుతం జగన్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గుర్తింపు అంటూ ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఈ వీడియోను మాత్రం జగన్, ఆయన అభిమానులు చూడాలే కాని తలదించుకోవాల్సిందే. దీనిని ఎవరు క్రియేట్ చేశారన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఇది నిజమే కదా? అన్నట్లుగా కనిపిస్తుంది.