Bhashyam Praveen : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 11 కుటుంబాలు – టీడీపీలోకి ఆహ్వానించిన భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : ఈరోజు అమరావతి మండలం మునుగోడులో వైఎస్ఆర్సి పార్టీకి చెందిన 11 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ఉద్యోగ అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు నాయుడును గెలిపించుకుంటే మన రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ జారిటీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.