Special Day : 11-11 ఈ రోజుకో ప్రత్యేకత ఉంది ఏంటో తెలుసా ?
special day November 11th : మీరు సింగిలా? లవర్స్ ను చూసి ఈర్ష్య పడుతున్నారా? అయితే మీకే ఈ గుడ్ న్యూస్.. అసలు ఇలాంటి గుడ్ న్యూస్ వింటామని అసలు అనుకోని ఉండం… ఇలాంటి ఒకరోజు వస్తుందని కానీ అసలు ఉహించి ఉండరు.. కానీ ప్రతి సింగిల్ గర్వపడే రోజు.. ఎంజాయ్ చేసే రోజు రాసేవచ్చింది.. అదే సింగిల్స్ డే.. నవంబర్ 11వ తేదీ సింగిల్స్ డే అంటే.. అసలు ఈ సింగిల్స్ డే ఎందుకు వచ్చిందో తెలుసా… 1990లలో చైనా దేశంలో సింగిల్స్ డేను అమల్లోకి తీసుకొచ్చారు.. నాన్జింగ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఒంటరిగా ఉండటాన్ని జరుపుకోవడానికి నవంబర్ 11 అంటే సంవత్సరంలోని పదకొండో నెల పదకొండో రోజుని సెలక్ట్ చేసుకున్నారు. నలుగురితో కూడిన తేదీ (11.11), సింగిల్ గా ఉండేందుకు ప్రతీక. ఏళ్లు గడిచేకొద్దీ, ఒంటరి జీవితాన్ని గౌరవించటానికి అది ఓ రోజుగా మారిపోయింది. ఇక ఈ నవంబర్ 11ని చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా 2009లో సింగిల్స్ డే ను షాపింగ్ ఈవెంట్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.. ఆరోజు భారీ ఆఫర్స్ పెట్టడంతో ఈ సింగిల్స్ డే కాస్త షాపింగ్ డే కూడా అయ్యింది..