Hanuman Records : భారీ అంచనాల నడుమ జనవరి 12 వ తారీఖున విడుదలైన ‘హనుమాన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం లాగ వసూళ్ల సునామీని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారుగా 200 కోట్ల రూపాయిల గ్రాస్, 103 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తి అయ్యాయి. 10 వ రోజు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ఇప్పటి వరకు కేవలం రాజమౌళి సినిమాకి తప్ప ఏ హీరో స్టార్ హీరోకి కూడా రాలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి కేవలం 10 వ రోజు 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట.
మొదటిరోజు కూడా ఈ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒక్క ఆదివారం రోజే ఇలా ఉంటే, ఇక జనవరి 26 వ ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 25 కోట్ల రూపాయలకు జరిగిందట. కేవలం నైజాం ప్రాంతం నుండే పది రోజులకు 24 కోట్ల రూపాయిల వచ్చాయట. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం ఒకే ఒక్క ప్రాంతం నుండి రాబట్టింది అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా కేవలం నార్త్ అమెరికా నుండి 4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
హిందీ లో కూడా ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతుంది. ఇప్పటి వరకు కేవలం హిందీ వెర్షన్ కి 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. లాంగ్ రన్ ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం హిందీ వెర్షన్ కి వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను సాదిస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించబోతున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది.