JAISW News Telugu

Viral Video : యూకేలో కాకరకాయలు కేజీ రూ.1000

Viral Video

Viral Video

Viral Video : మన దేశంలో ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. టమాటా ధర ఏకంగా రూ.100 దాటగా కాకరకాయలు ధర రూ.1000 పలుకుతోంది. కారణం ఏదైనా మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కూరగాయల ధరలు ఇలానే భారీగా పెరిగాయి. ధరల మంట మన దేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లోని ఇండియన్ స్టోర్స్ లోనూ ధరలు భారీగా పెరిగాయి.

కాకరకాయలు కేజీ రూ.1000, బెండకాయలు కేజీ రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయలు రూ.2,400 ఈ ధరలు వింటుంటే గుండె గుభేలుమంటోంది.  కానీ ఈ రేట్లు ప్రస్తుతం బ్రిటన్ లోని భారతీయ స్టోర్స్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్ లో నివసిస్తున్నారు. ఇండియన్ స్టోర్స్ లో ఉన్న ధరలు చూసి, ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్ లో సరకుల రేట్లు చూపిస్తూ ఇన్ స్టాగ్రాంలో ఒక వీడియోను పోస్టు చేశారు.

అక్కడి కరెన్సీ (పౌండ్ స్టెర్లింగ్)ని మన రూపాయల్లో పోల్చి చూస్తే ధరలు ఎక్కువగానే ఉంటాయని, అయితే రేట్లు మాత్రం కాస్త ఎక్కువేననే అభిప్రాయం వ్యక్తమైంది. బ్రిటన్ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమే కానీ, ఈ వీడియో కాస్త అతిగా ఉందని కొందరు నెటిజన్లు స్పందించారు.

Exit mobile version