JAISW News Telugu

Prashant Varma : అక్షరాలా 1000 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ!

Prashant Varma

Prashant Varma, HanuMan Movie

Director Prashant Varma : హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పెద్ద సినిమాలని దాటుకుని సూపర్ డూపర్ హిట్ అయ్యింది, 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 278.36 కోట్లలో వాసులు సాధించింది, ఇంకా ఈ సినిమా థియేటర్ల దెగ్గర దూసుకుపోతుంది ఇంకా విజయం సాధించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ప్రశాంత్ వర్మ తీసిన 5 సినిమాలో హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవల్ క్రేజ్ దక్కించుకుంది.

ప్రశాంత్  వర్మ తీసిన సినిమాలు కల్కి, అవె, జోంబీ రెడ్డి, అద్భుతం, హనుమాన్ ఈ సినిమాలు అన్ని మంచి  హిట్ కొట్టాయి అనే చెప్పాలి. ఇటీవలే విడుదలైన గుంటూరు కారం సినిమాని కూడా ఢీకొట్టి హనుమాన్ హిట్ కొట్టడం తో ప్రశాంత్ వర్మ కి మంచి క్రేజ్ దక్కింది ఇక ఈ సినిమాతో పలు ప్రొడ్యూసర్ ప్రశాంత్ వర్మ సినిమా కోసం ముందుగా క్యూ కట్టి అడ్వాన్స్ లు ఇవ్వడానికి కూడా రెడీ గా ఉన్నారని ప్రశాంత్ వర్మ తెలియ చేసారు.

ఈ సినిమాకి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కింద అమెరికన్ ఎన్నారై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గండగట్ల నిరంజన్ రెడ్డి ఫండ్ సమకూర్చారు, 20 కోట్ల షూ స్ట్రింగ్ బడ్జెట్ తో నిర్మించారు. 2022 నవంబర్ లో హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ లో జరిగిన ప్రొడక్షన్ బడ్జెట్ ప్రారంభ వాల్యుయేషన్ కంటే 6 రేట్లు పెరిగిందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇక హనుమాన్ కథ ప్రశాంత్ వర్మ తన  సోదరి స్నేహ సమీరా తో కలిసి స్థాపించాడు.

ఒక ఇంటర్వ్యూ లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ గురుకులం లో తన చదువు సినిమా పరిశోధనలో తనకు సహాయపడింది చెప్పాడు, ఈ సినిమా చేసే సమయానికి సెన్సషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సలహా తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమాకి బాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ప్లస్ అయ్యింది, ఇటీవలే ఫైటింగ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు వస్తున్నా తరుణం లో సాంకేతికంగా రూపొందించిన సినిమా ఈ హనుమాన్. విజువల్స్, విఎఫెక్, అన్ని నిర్మాణ అంశాలు అందరిని అక్కటుకున్నాయి.

తేజ సజ్జ ఈ  సినిమాతో మంచి పేరు అభిమానులను అక్కటుకుని క్రేజ్ దక్కించుకున్నాడు,  ఇక ప్రశాంత్ వర్మ వ్యక్తిగత విషయానికి వస్తే అయినా 1989 మే 29న ఆంధ్ర ప్రదేశ్ లోని పాలకొల్లు లో జన్మించారు, అతని తల్లితండ్రులు నారాయణరాజు, సివిల్ కాంట్రాక్టర్ మరియు తల్లి కనకదుర్గ ప్రభుత్వ పాఠశాల టీచర్. ప్రశాంత్ వర్మ కి స్నేహ సమీరా అనే చెల్లలు ఉంది, ఇక 2020 లో ప్రశాంత్ సుకన్యరాజు ని వివాహం చేసుకున్నాడు.

ప్రశాంత్ కి  చిన్నప్పటినుండి సినిమాల పిచ్చి ఎక్కువ ఉండేది, ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిల్మ్ తీసి తన కెరీర్ ని ప్రారంభించాడు, ఆ తరువాత ఏ సైలెంట్ మెలోడీ మరియు డైలాగ్ ఇన్ ది డార్క్ తో సహా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసారు. 2015 లో వచ్చిన బ్రియాన్ లారా నటించిన నాట్ అవుట్ అనే ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు, ప్రశాంత్ తొలి సినిమా ఆవె సినిమాకి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బెస్ట్ మేకప్ కి నేషనల్ ఫిలిం అవార్డు గెల్చుకున్నాడు.

హనుమాన్ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ కి వరస ఆఫర్లు మరియు 300 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయమని ఆఫర్లు వాచినట్టు ప్రశాంత్ ఇటీవలే తెలిపారు అయితే సినిమా బిడ్జెట్ కాదు సినిమాకి సరిపడా విజువల్స్ , క్వాలిటీ మంచి మేకింగ్స్ ఇచ్చామా లేదా అనేది ముఖ్యం అంటూ ప్రశాంత్ వర్మ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు, తక్కువ బడ్జెట్ లోనే మంచి సినిమా తీస్తాను అని మంచి వాసులు సాదిస్తాను అని కూడా ప్రశాంత్ వర్మ తెలిపారు.

ఈ సినిమా స్క్రీన్ రైటింగ్, యాక్టింగ్, ప్రదర్శనలు, విజువలైజేషన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్, విఎఫెక్, ప్రొడక్షన్ మరియు డిజైన్ సెక్యూన్సెస్ అన్ని ఈ సినిమాకి ప్లస్ అయిందనే చెప్పచు ఇక  హీరో తేజ సజ్జ మరియు హీరోయిన్ అమ్రితా  ఏయిర్ కూడా ఈ సినిమాలో బాగా నటించారు, అన్నిటికి మించి వీటి అన్నిటి  కోసం ప్రశాంత్ వర్మ  చాలా కష్టపడ్డారు ఫలితంగా సినిమా మంచి ప్రజాదరణ పొందింది.

ప్రశాంత్ వర్మ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు ఆ తరువాత మూడవ సినిమా  హీరో తేజ సజ్జ తో కలిసి జోంబీ రెడ్డి మంచి హిట్ కొట్టింది వాస్తవానికి 2020 కి షెడ్యూల్ చేయబడింది కానీ లొక్డౌన్ కారణం గా ఆ సినిమా ఆలస్యం అయ్యింది అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది, ఇపుడు ఇక ప్రశాంత్ వర్మ కి  హనుమాన్ సినిమా తరువాత వరస ఆఫర్లు వస్తున్నాయి అని తెలుస్తుంది, ఇప్పటికి ఈ సినిమా 300 కోట్లు వాసులు చేసింది, ఇక 500 కోట్లు పైగా వాసులు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

సినిమాల మీద ఇష్టం తో ప్రశాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు తన చదువు లో తోప్పేర్ అయినప్పటికీ పస్సిఒన్ తో సినిమాలు చేస్తున్నాడు అలానే హిట్స్ కూడా కొడుతున్నాడు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా ఇప్పటికే 300 కోట్లు వాసులు సాధించింది. 2024 సంవత్సరం లో అత్యధిక వాసులు చేసిన మొదటి చిత్రం గా ‘ హనుమాన్’ నిలిచింది.

Exit mobile version