Kalki Records : అక్షరాల 1000 కోట్లు.. కల్కి కలెక్షన్ల రికార్డులు బద్దలు.. పోస్టర్ వైరల్

Kalki Records

Kalki Records

Kalki Records : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద  రోజుకో సంచలనం సృష్టిస్తున్నది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ను  జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని చూసిన  ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం, ఊహించని ట్విస్టులు చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. వైజయంతి మూవీస్  రూ.600 కోట్లతో ఈ సినిమాను నిర్మించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసిన భారతీయ సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. కల్కి కన్నా ముందు ఈ రికార్డును సాధించిన భారతీయ సినిమాలు మరో ఆరు ఉన్నాయి. ఇక ఇప్పుడు కల్కి సినిమా ఏడో స్థానంలో నిలిచింది.

కల్కి సినిమా విడుదలైన 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.  ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.  కల్కి కొన్ని అరుదైన ఫీట్లను సాధించింది. నార్త్ అమెరికాలో 16.2 మిలయన్ డాలర్లు వసూలు చేసి, నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. బుక్ మై షోలో కోటికి పైగా టికెట్లు అమ్ముడైన సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది కల్కి. ఇక ఈ వీకెండ్స్‏లో కల్కి వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూవీలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో సినిమాను తన భుజాల మీద మోశాడు. 80 ప్లస్ ఏజ్ లో బిగ్ బీ ఎనర్జీ చూసి షాక్ అవుతున్నారు.

ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో మొదటి స్థానంలో అమిర్ ఖాన్ దంగల్ (2016) సినిమా నిలిచింది. దంగల్ సినిమా రూ.2024 కోట్లు రాబట్టి ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉంది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 (2017) సినిమా రూ. 1810 కోట్లు కొల్లగొట్టి రెండో స్థానంలో ఉంది. ఎస్ ఎస్ రాజమౌళి  తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (2022) మూవీ రూ.1387 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేజీఎఫ్ -2 (2022) రూ.1250 కోట్లు,  షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ సినిమా (2023) రూ.1050 కోట్లు రాబట్టిన చిత్రాలుగా వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం రూ. 1000 కోట్ల కలెక్షన్లతో ఏడో స్థానంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా నిలిచింది.

TAGS