JAISW News Telugu

Salaar Vs HanuMan : 4 రోజుల్లో 100 కోట్లు..బాలీవుడ్ లో ‘సలార్’ ని మించిపోతున్న ‘హనుమాన్’ కలెక్షన్స్!

Salaar Vs HanuMan Collections

HanuMan crossing salaar Collections

Salaar Vs HanuMan Collections : చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ వసూళ్లు సాధిస్తూ స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘హనుమాన్’. నిజంగా ఈ స్థాయి వసూళ్లు ఒక చిన్న సినిమాకి వస్తుందని, అది పెద్ద హీరోలకు కూడా కొత్త బెంచ్ మార్క్ ని తెచ్చి పెడుతుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. ఉదాహరణకి ఓవర్సీస్ మార్కెట్ తీసుకుందాం.

ఇక్క నార్త్ అమెరికా లో మన తెలుగు సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. ఈ ప్రాంతం లో హనుమాన్ చిత్రం అప్పుడే 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే కేవలం ఒకరిద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలకు తప్ప ఎవరికీ కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. ఫుల్ రన్ లో ఈ సినిమాకి 5 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందట.

ఇప్పటి వరకు నార్త్ అమెరికా లో 5 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టిన తెలుగు  చిత్రాలు #RRR , బాహుబలి సిరీస్ మరియు సలార్ మాత్రమే. కానీ ‘హనుమాన్’ చిత్రం స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఈ రికార్డు ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ చిత్రం తో విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి డిజాస్టర్ వసూళ్లను దక్కించుకుంటూ థియేటర్స్ మొత్తం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హనుమాన్ చిత్రానికి థియేటర్స్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఈ రేంజ్ లో తొక్కుతున్నప్పటికీ కూడా హనుమాన్ చిత్రం ఇంత వసూళ్లను రాబట్టడం నిజంగా అద్భుతమే. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకి నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

హిందీ లో అయితే 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లకు అతి చేరువలో ఉంది. ఫుల్ రన్ కచ్చితంగా ఉండే అవకాశం ఉండడం తో ఈ సినిమా సలార్ వసూళ్లను దాటే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సలార్ చిత్రం హిందీ లో దాదాపుగా 130 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ కలెక్షన్స్ ని ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రం దాటేయబోతుందట. ఇదే కనుక జరిగితే చరిత్ర సృష్టించిన సినిమాగా మిగిలిపోతుంది హనుమాన్ .

Exit mobile version