KTR : 10 వేల కోట్ల భూముల స్కాం: రేవంత్, బీజేపీ ఎంపీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR : హెచ్‌సీయూ భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ స్కాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక బీజేపీ ఎంపీ కలిసి పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు.

ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీ భాగస్వామిగా ఈ డీల్‌లో ఉందని, రేవంత్ రూ.170 కోట్లు లంచంగా ఇచ్చారని కేటీఆర్ దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూములుగా గుర్తించిన హెచ్‌సీయూ భూములను అక్రమంగా టీజీఐఐసీకి బదిలీ చేసి, RBI మార్గదర్శకాలను ఉల్లంఘించి రూ.10,000 కోట్లను తెచ్చుకున్నారని ఆరోపించారు.

ఈ అంశంపై కేటీఆర్ ఇప్పటికే RBI, CBI, CVC, SFIO, SEBIలకు లేఖలు రాసి విచారణ కోరారు. త్వరలోనే ఈ స్కాంలో భాగమైన బీజేపీ ఎంపీ పేరును బయటపెడతానంటూ కేటీఆర్ హెచ్చరించటం మరింత చర్చనీయాంశమైంది.