JAISW News Telugu

Minister Posts : ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి మంత్రి పదవులు – నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8మందికి అవకాశం

AP Ministers

Minister Posts

Minister Posts : తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో చోటిచ్చారు. నారా లోకేష్‌, పవన్‌ తో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన వారిని బాబు తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు.

వారిలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి లు తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంతేగాకుండా పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు  పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి లు గతంలో మంత్రులుగా చేసిన వారు.

జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం దక్కింది.బీజేపీ నుంచి సత్య కుమార్ మాత్రమే మంత్రి కానున్నారు. వీరితో పాటు ప్రకాశం జిల్లా నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవిత, తూర్పుగోదావరి నుంచి వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మందపల్లి రాంప్రసాద్రెడ్డిలను చంద్రబాబు ఎంపిక చేశారు. కొందరు సీనియర్లతో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విశాఖ జిల్లా నుంచి కేవలం ఎస్సీ మహిళ వంగలపూడి అనితకు మాత్రమే కేబినెట్ లో అవకాశం లభించింది.

Exit mobile version