Megastar Chiranjeevi : 10 నిమిషాలు కేవలం ఎక్స్ ప్రెషన్సే.. మెగాస్టార్ నటన అంటే అలా ఉంటుంది..
Megastar Chiranjeevi : డైరెక్టర్ గుణశేఖర్, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమా ‘చూడాలని ఉంది’. ప్రొడ్యూసర్ గా అశ్వినీదత్ వ్యవహరించారు. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇటు చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ల రప్పించడంలో సక్సెస్ అయ్యింది. మణిశర్మ అందించిన స్వరాలు కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఆ పాటలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి.
ఈ మూవీకి హైలట్ గా నిలిచింది రైల్వే స్టేషన్ సీన్. ఈ సీన్ లో చిరంజీవి, అంజలా ఝవేరి మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండా.. కేవలం ఎక్స్ ప్రెషన్స్ తోనే సన్నివేశాన్ని తెరకెక్కించాడు దర్శకుడు గుణశేఖర్.
ఆ సీన్ గురించి డైరెక్టర్ గుణశేఖర్ ఒక సందర్భంలో ఇలా చెప్పుకచ్చాడు. రైల్వే స్టేషన్ లో ఉండే ఆ లవ్ సీన్ 10 నిమిషాల ఉంటుంది. ఇందులో చిరంజీవికి డైలాగ్స్ ఉండవు. మరొకరిని పికప్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చిన చిరంజీవి స్టేషన్ లో బెంచ్ పై కూర్చుంటాడు. అప్పుడే ప్లాట్ ఫాంపైకి వచ్చిన ట్రెయిన్ లో అంజలా ఝవేరి ఉంటుంది. కేవలం అమ్మాయిని చూస్తుండాలి.. ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే.. నో డైలాగ్స్ అని చెప్పగానే అశ్వినీదత్ షాక్ అయ్యాడు.
ఈ సీన్ షూట్ చేసేందుకు నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కావాలని అడిగాం. పర్మిషన్ కూడా వచ్చేసింది. ఆ సమయంలో అశ్వనీదత్ ఆశ్చర్యపోవడంలో ఎలాంటి తప్పులేదు. ఫ్రేమ్ లో చిరంజీవి ఉండి డైలాగ్స్ లేకుండా నిమిషం సన్నివేశం నడపాలంటే కష్టమైన విషయం. అలాంటిది 10 నిమిషాలు ఇంపాజిబుల్ అనుకున్నా. పైగా ఈ సన్నివేశం చేసేందుకు నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కావాలంటే జరిగే పని కాదు.
అప్పట్లో నాంపల్లి రైల్వే స్టేషన్ పెద్దది. చాలా రైళ్లు వచ్చీ వెళ్తేండేవి. అలాంటి రద్దీ ఏరియాలో.. మెగాస్టార్ లాంటి స్టార్ ను పెట్టుకొని సీన్ తీయడం అంటే అంత ఆశామాషీ కాదు. మొదట చిరంజీవి హీరో అనడంతో రైల్వే శాఖ చాలా ఆలోచించింది. ఎందుకంటే అప్పటికే మెగాస్టార్ పెద్ద హీరో.. ఆయన చూసేందుకు ఎగబడేవారు. ఇక ఆయన షూటింగ్ కు పర్మిషన్ అంటే ప్రయాణికులకు ఎంత ఎగ్జయిట్ మెంట్ ఉంటుందో రైల్వే శాఖకు అన్ని ఇబ్బందులు ఉంటాయి కదా.. చాలా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కొన్ని ఆపి వేయాల్సి ఉంటుంది. సమయాలు కూడా మారిపోతాయి. అతి కష్టం మీదే రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. అలా షూటింగ్ కంప్లీట్ చేశాం. కష్టానికి తగ్గట్టే సినిమా కాసుల వర్షం కురిపించింది.