OTT Movies : నాలుగు రోజుల్లోనే 10 మిలియన్ స్ట్రీమ్స్ ఈ మూవీ ఓటీటీకే హైలైట్..

OTT Movies

OTT Movies

OTT Movies : రాను రాను పెద్ద, పెద్ద స్టార్లు వెండితెరపై కనుమరుగవుతున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నా.. మూవీకి సంబంధించి కంటెంట్ మాత్రమే మేజర్ రోల్ పోషిస్తుండడంతో చిన్న చిన్న తారలు, ఫ్రెష్ కాస్ట్ తో భారీ విజయాలు నమోదు చేసుకుంటున్నారు దర్శకులు.

ప్రయోగాత్మక చిత్రాలు, థ్రిల్లర్ల పరంపరలో ‘శ్రీనిధి బెంగళూరు’ దర్శకత్వం వహించిన ‘బ్లింక్’ ప్రత్యేకమైన సబ్జెక్టు, మేకింగ్, పెర్ఫార్మెన్స్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ధీశిత్ శెట్టి నటించిన బ్లింక్ ఇటీవల థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది, ఇది కన్నడ ఇండస్ట్రీ ‘శాండిల్‌వుడ్’లో కొత్తవారితో భారీ విజయం సొంతం చేసుకున్న సినిమా.

10 మిలియన్ స్ట్రీమ్స్
ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ కన్నడ చిత్రానికి ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై నిర్మాత తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అప్డేట్ ఇచ్చాడు. ‘బ్లింక్ నాలుగో రోజైన శనివారం మేము మూడు మిలియన్ నిమిషాలకు చేరుకున్నామని ప్రకటించడానికి మేము థ్రిల్లింగ్గా ఉన్నాం. ఇది మా మొత్తాన్ని నమ్మశక్యం కాని 10 మిలియన్ నిమిషాలకు (1 కోటి నిమిషాలు) తీసుకువస్తుంది. మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థాంక్స్’ అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Janani Pictures (@janani_pictures)


టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మార్చిలో డాక్టర్ శివరాజ్ కుమార్, ప్రభుదేవా నటించిన కరతక దమనకా, జగ్గేష్ నటించిన రంగనాయక వంటి పెద్ద స్టార్ చిత్రాలతో కలిసి విడుదలైంది. ఈ రెండు కన్నడ స్టార్ల సినిమాలతో పాటు కర్ణాటకలో మంచి బిజినెస్ చేసిన ప్రేమలు, బ్రహయుగం, మంజుమ్మెల్ బాయ్స్ వంటి మలయాళ చిత్రాల నుంచి బ్లింక్ గట్టి పోటీని ఎదుర్కొంది.

50 రోజుల లెక్కింపు
ఈ చిత్రం మొదట్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 14 స్క్రీన్లలో మాత్రమే విడుదల కావడంతో మౌత్ పబ్లిసిటీతో 80 స్క్రీన్లకు చేరుకుంది. పబ్లిసిటీ, పాపులారిటీతో పైరసీ ముప్పు వచ్చింది. బ్లింక్ పైరసీ వెర్షన్లు చూడొద్దని, ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి చూడాలని చిత్ర నిర్మాత ప్రేక్షకులను కోరినట్లు తెలిసింది. బ్లింక్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

TAGS