JAISW News Telugu

17th day Hanuman : 17వ రోజు లక్షా 50 వేల టిక్కెట్లు.. ఎవ్వరూ అందుకోలేని రికార్డుని నెలకొల్పిన ‘హనుమాన్’

17th day Hanuman

17th day Hanuman

17th day Hanuman : ‘హనుమాన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వీరవిహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. జనవరి 12 వ తారీఖుల ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం రీసెంట్ గానే 250 కోట్ల రూపాయిల మైలు రాయిని దాటిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లోనే హాట్ టాపిక్ గా నిల్చింది. రాజమౌళి , ప్రభాస్ మరియు అల్లు అర్జున్ మినహా ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా 250 కోట్ల రూపాయిల మైలు రాయిని దాటలేదు.

అలాంటిది తేజ సజ్జ అతి తేలికగా దాటేయడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో అయితే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను మ్యాచ్ చెయ్యడం స్టార్ హీరోలకు కూడా అసాధ్యమే అని చెప్పొచ్చు. ఈ జోరు ఇప్పటిలో ఆగేలా లేదు. నిన్న ఆదివారం రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపించింది.

బుక్ మై షో యాప్ చూపిస్తున్న గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజే ఒక లక్షా 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి అట. రీసెంట్ గా విడుదలైన ఏ స్టార్ హీరో సినిమాకి కూడా ఈ రేంజ్ లో 17 వ రోజు టిక్కెట్లు అమ్ముడుపోలేదు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి 17 వ రోజు కేవలం 50 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దీనిని బట్టీ ‘హనుమాన్ ‘ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వసూళ్లు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు కాబట్టి. కచ్చితంగా ఈ చిత్రం రాబొయ్యే రోజుల్లో 300 కోట్ల రూపాయిల మైల్ స్టోన్ ని కూడా అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. నైజాం ప్రాంతం లో నిన్నటితో ఈ సినిమా 30 కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటేసింది.

సాధారణమైన టికెట్ రేట్స్ తో ఈ రేంజ్ వసూళ్లు అనేది మామూలు విషయం కాదు. కేవలం హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్స్ షోస్ నుండి ఈ సినిమాకి 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని టచ్ చేస్తుంది. ఒక్క ప్రభాస్ కి తప్ప ఏ స్టార్ హీరోకి కూడా హైదరాబాద్ సిటీ లో 20 కోట్ల సినిమా లేదు. రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని మైల్ స్టోన్స్ ని దాటుతుందో చూడాలి.

Exit mobile version