నెట్టింట తన పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాతో పాటు నా సహచరులపై సోషల్ మీడియాలో కొందరు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఫిర్యా దులో పేర్కొన్నారు.
అవి నిరాధారమైనవి అయినా నన్ను అవమానించేలా ఉన్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా 8 మంది సోషల్ మీడియా ఖాతాలపై వైఎస్ షర్మిల ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది.