JAISW News Telugu

Ambati Rayudu : ఏపీలో వైసీపీ ఓటమి.. అంబటి రాయుడు సంచలన ట్వీట్..

FacebookXLinkedinWhatsapp

Ambati Rayudu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూటమి అభ్యర్ధులు.. వైసీపీ అభ్యర్థులను మట్టికరిపిస్తున్నారు.

మ్యాజిక్ ఫిగర్ను దాటేసి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంతో నారా లోకేష్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని రాయుడు ట్వీట్ చేశారు.

Exit mobile version