TDP-YCP: వైసిపీ ఎమ్మెల్యే లకు అభద్రత భావం పెరిగింది…టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి 

కడప జిల్లా: ఎన్నికల వేడి మొదలయ్యే సరికి వైసిపీ ఎమ్మెల్యే లకు అభద్రత భావం పెరిగిందని పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి ఆరోపిం చారు. కడప లో అంజాద్ బాషా కు ఓటమి భయం పట్టుకుందని ఆయన ఆరోపించారు.  మొన్న 31 వ డివిజన్ లో టీడీపీ స్టికర్ లను అంజాద్ బాషా, అనుచరులు తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే స్టికర్ లు చించే స్థాయి కి దిగజారి పోయారని డిప్యూటీ సిఎం గా  నగరానికి ఏమి చేసాడని అడిగితె పే టి ఎం బ్యాచ్ లతో తిట్టిస్తున్నాడని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.  టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే వైసిపీ శ్రేణులకు తాట తీస్తామని అని ఆయన హెచ్చరించారు.  వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కొంత మంది వాలంటీర్ లు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాలంటీర్ లు పరిధి దాటి ప్రవర్తిస్తున్న వారిని గుర్తుకు పెట్టుకుంటామని వైసిపీ ఏజెంట్ ల లా సచివాలయ, వాలంటీర్ లు వ్యవహా రిస్తున్నారని మండిపడ్డారు.. టీడీపీ ఇంటింటికి ప్రచారం వెళ్తే స్టికర్ లు చించి అడ్డుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ లకు జగన్ జేబులో నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు.

 

 

TAGS