CM Revanth : టీడీపీని ఖతం చేయాలనుకోవడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి: సీఎం రేవంత్

CM Revanth
CM Revanth : జగన్ చేసిన పాపాల వల్లే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి దుస్థితి వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకొని జగనే ఖతమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరులతో రేవంత్ మాట్లాడారు. పాలనను విస్మరించినందుకే జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. జగన్ చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు.
ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతిందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే హైదరాబాద్ లోని జగన్ ఇంటి వద్ద ఉన్న నిర్మాణాలను కూల్చివేశామన్నది అబద్ధమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.