KCR:కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
KCR:మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం అర్ధ్రరాత్రి తన ఫామ్ హౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబం సభ్యులు, అధికారులు ఆయనను గజ్వేల్ సమీపంలోని ఫామ్ హౌస్ నుంచి హైదారాబాద్, సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. ఆయనని పరిశీలించిన డాక్టర్లు వివిద టెస్ట్‌ల అనంతరం కేసీఆర్ తుంటి భాగం విరిగినట్టుగా స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆపరేషన్ చేసి తుంటి భాగంలో రెండు చోట్ల స్టీల్ ప్లేట్లు వేయనున్నట్టు వెల్లడించారు.
ఇదిలా ఉంటే తాజాగా యశోద హాస్పిటల్ డాక్టర్లు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అంతే కాకుండా కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక మార్పిడి చేయాలన్నారు. `బాత్‌రూమ్‌లో జారిపడటంతో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎడమకాలి తుంటి ఎముక మార్పిడి చేయాలి. చికిత్స అనంతరం కేజీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు` అని హెల్త్ బులెటిన్‌లో డాక్టర్లు పేర్కొన్నారు.