Yanamala Krishnadu : టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా

Yanamala Krishnadu
Yanamala Krishnadu : ఎన్నికల వేళ టీడీపీకి కీలక నేత రాజీనామా చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం టికెట్ యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యకు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
తన అన్న యనమల రామకృష్ణుడితో విభేదాల నేపథ్యంలో యనమల కృష్ణుడు టీడీపీని వీడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు తునిలో టీడీపీ టికెట్ పై పోటీచేసి ఓడిపోయిన ఆయన.. మూడోసారి టికెట్ ఇవ్వకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో వైసిపిలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.