JAISW News Telugu

KCR:గేమ్ షురూ..కేసీఆర్‌కు భ‌ద్ర‌త కుదించిన ప్ర‌భుత్వం

KCR:తెలంగాణ ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుభి మోగించిన కాంగ్రెస్ ఊహించ‌ని విధంగా అధికారంలోకి వ‌చ్చింది. పార్టీ స్టార్ క్యాపెయిన‌ర్‌గా నిలిచిన టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ప్రమాణ స్వీకారోత్స‌వం రోజునే దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఇనుప‌కంచెల‌ని తొల‌గించి చ‌ర్చనీయాంశంగా మారిన రేవంత్‌రెడ్డి వ‌రుస‌గా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు.

తాజాగా కొత్త గేమ్‌ని స్టార్ట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. ఆయ‌న భ‌ద్ర‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కుదించడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న‌కు వై కేట‌గిరి భ‌ద్ర‌త‌ను ప్ర‌భుత్వం కేటాయించింది. మాజీ మంత్రుల‌కు 2 ప్ల‌స్ 2 భ‌ద్ర‌త‌ను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేల‌కు పూర్తి భ‌ద్ర‌త‌ను తొల‌గించింది. వారికి కేటాయించిన గ‌న్‌మెన్ల‌ను పోలీసు ఉన్న‌తాధికారులు వెన‌క్కి పిలిపించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవ‌రెవ‌రికి భ‌ద్ర‌త అవ‌స‌ర‌మ‌నే అంశంపై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించి అధికారులు నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక మేర‌కు గ‌న్‌మెన్ల‌ను పోలీసు శాఖ కేటాయించ‌నుంది. కాగా ఆరు రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను మ‌రి కాసేప‌ట్లో డిశ్చార్జ్ చేయ‌డానికి ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. తుంటి మార్పిడి విజ‌య‌వంతం కావ‌డం, మ‌రుస‌టి రోజునే కేసీఆర్ వాక‌ర్ సాయంతో న‌డ‌వ‌డం, ఆరోగ్యం కుదుట‌ప‌డ‌టంతో ఆయ‌న‌ను డిశ్చార్జ్ చేయాల‌ని వైద్యులు నిర్ణ‌యం తీసుకున్నారు. డిశ్చార్జ్ త‌ర్వ‌త కేసీఆర్ హైద‌రాబాద్ నందిన‌గ‌ర్‌లోని త‌న పాట ఇంటికి వెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version