జగిత్యాల జిల్లా : దేశానికి ఏం చేశారని భాజపా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారని జగిత్యాలలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ప్రశ్నించారు…వ్యవసాయం పై ఆధారపడ్డ రైతంగాం ఢిల్లీ సరిహద్దు లో కనీస మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా పట్టిం చుకోవటంలేదు గానీ.. అంబానీ,ఆదానిలాంటి పెట్టుబడిదారులకు NP అకౌంట్ల ద్వారా రుణవిముక్తులను చేశారన్నారు..
రైతుల ను రుణవిముక్తులను ఎందుకు చేయరని ప్రశ్నించారు.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మద్దతు ధర కు చట్టభద్దత క ల్పిస్తే రైతు మద్దతూ ధర పొందే అవకాశం ఉంటుందన్నారు.. నిత్యవసర ధరలపై పట్టించుకోవటంలేదని.. పెట్రోలు ధరలు తగ్గించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.. పదేళ్లుగా పెట్టుబడిదారుల కోసమే పని చేశారని పేదలకు కాదని జీవన్‌రెడ్డి మండిప డ్డారు.