JAISW News Telugu

Weather Alert : మరింత పెరగనున్న ఎండ తీవ్రత.. హెచ్చరికలు జారీ చేస్తున్న అధికారులు..

Weather Alert : మే రాకముందే ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. బయట అడుగు పెట్టాలంటేనే ఆందోళన చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

రోజు వారీ బ్రీఫింగ్‌లో భారత వాతావరణ శాఖ (IMD) భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హీట్‌వేవ్ పరిస్థితుల కోసం సూచలు వేసింది. IMD నివేదిక ప్రకారం, ఏప్రిల్ 7, 2024న ఈశాన్య భారతంలో ఉరుములతో కూడిన వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని, అప్పటి వరకు ఎండ తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తోంది.

ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తూర్పు, ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏప్రిల్ 4వ తేదీ కర్ణాటక, కోస్తా ఆంధ్రలో మరింత వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్‌లలోని కూడా వేడిపెరిగే అకాశం ఉంది.

ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు రాయలసీమ, గంగానది పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు మధ్యప్రదేశ్‌లోని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. జార్ఖండ్, విదర్భలోని వివిక్త ప్రాంతాలు కూడా ఏప్రిల్ 4, 5 తేదీల్లో హీట్‌వేవ్ ఎదుర్కొంటాయని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం తొలిసారిగా 45 డిగ్రీల ఊష్ణోగ్రత నిన్న (ఏప్రిల్ 3) నమోదైంది. తెలంగాణలో ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఊష్ణోగ్రతలు 40  డిగ్రీల వరకు నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉంటాయని IMD ఒక అంచనా వేసింది. 

Exit mobile version