Tamilisai:కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపిస్తాం:తమిళిసై

Governor Tamilisai:స్పీకర్ ఎన్నిక తర్వాత ఇవాళ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారంటీలు అమలు చేశాం, ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందించామని, మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దామని, రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన అని డిక్లరేషన్లు అమలు చేస్తామని, అమర వీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలం, గౌరవభృతి ఇస్తామని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ కొనియాడారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు. అసైన్డ్, పోడుభూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని తమిళిసై స్పష్టం చేశారు.

TAGS