తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్,బడవ పేట ప్రాంతాలలో_తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు “మీ అవినాష్ అన్న హామీ” పేరుతో ముంద్రించిన మ్యానిఫెస్టో కరపత్రాలు ప్రజలకు అందించారు., ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.
గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా మా కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్,నాగార్జున నగర్ పార్క్ ప్రాంతాలలో దేవినేని సుధీర,11వ డివిజన్,అమ్మ హాస్పిటల్ రోడ్,దుర్గా మహల్ రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి, 19వ డివిజన్,బృందావన్ కాలనీ అపార్టుమెంట్లు ప్రాంతాలలో వై.సిద్దార్థ లు గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మహాన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన నాటి నుండి కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని అన్నారు. జగనన్న అందిస్తున్న పాలన గురుంచి చదువుకునే పిల్లలు దగ్గర నుండి పెన్షన్ తీసుకొనే ముసలి వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి చెబుతూ వారి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని పేరుతో చేసిన స్కాం లు గాని, టీడీకో ఇళ్ల పేరుతో చేసిన మోసం ప్రజలు ఎవరూ మర్చిపోలేదు అని అన్నారు. కానీ నేడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు వాటికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు.
ప్రజానీకానికి ఏమి కావాలి అనేది తెలుసుకొని ఆ పధకాలు అందజేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఏమి తప్పు చేసారని చంద్రబాబు వలంటీర్ లను జైలులో పెట్టిస్తా అంటున్నారు అని ప్రశ్నించారు. కరోనా సంక్షోభంలో తమ ప్రాణాలను పణంగా పెట్టీ సేవ చేసినందుకు, పెన్షన్లు,సంక్షేమ పథకాలు గడప వద్దకే ఇస్తున్నందుకా వారిని జైల్లో పెట్టేది అని సూటిగా ప్రశ్నించారు. లోకేష్ రెడ్ బుక్ అని అధికారులను బెదిరిస్తుంటే, చంద్రబాబు వలంటీర్ ల మీద కేస్ లు అని బయపెట్టాలని చూస్తున్నారని, మీ ఉడతా ఊపులకు ఎవరు బయపడరు అని ఎద్దేవా చేశారు.
రా కదలి రా అని మీరెన్ని సభలు పెట్టిన మీ మీద నమ్మకం లేక మీ పార్టీ నాయకులే రావడం లేదని విమర్శించారు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు తో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ పర్యటనలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి,19వ డివిజన్ కార్పొరేటర్ రహేనా నాహీద్,కో అప్షన్ సభ్యులు సయ్యద్ అలీమ్, మరియు డివిజన్ ప్రెసిడెంట్లు,మండల ఇంఛార్జీలు,క్లస్టర్ ఇంఛార్జీలు,సోషల్ మీడియా మిత్రలు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.