JAISW News Telugu

KCR : ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కోవాల్సిందే..కేసీఆర్

KCR : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  సమావేశం ముగిసింది.  సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లే దని కేసిఆర్ ఆరోపించారు.  ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదని ఆయన అన్నారు..

ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కోవాల్సి  పరిస్థితి   వస్తుందని కేసిఆర్ అన్నారు.  మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు అవగాహన లేక   కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రాజెక్టులను కేంద్రానికి  అప్పగించిందన్నారు.  ఈ నెల 13న నల్గొండలో  ఎన్ని అడ్డంకులు  సృష్టించినా సభ నిర్వహించి తీరుతాం అని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Exit mobile version