JAISW News Telugu

PRC-Committee: పిఆర్సీ ఇచ్చేస్తున్నాం- ఇక ఐఆర్ ఎందుకు? ఉద్యోగ నేతలతో మంత్రుల కమిటీ.

ఏపీలో ఎన్నికలవేళ ఉద్యోగులు తమ సమస్యలపై గళం విప్పుతున్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 27న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఉద్యోగులకు మధ్యతర భృతి పై ప్రకటన చేస్తామంటూ లీకులు కూడా ఇచ్చారు.  చివరకు ఉద్యోగులకు కొత్తగా ఏమి చెప్పకుండా అని జులై 31 నాటికి పిఆర్సి చేస్తామని చెప్పి వెనక్కి పంపారు.

ఈ నేపద్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో మంత్రులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అక్కడ ఏం జరిగిందో మీడియాకు వివరించారు.  జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు ఫలవంతం కాలేదని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయం ప్రకారం పిఆర్సీని నియమించినప్పుడు మద్యంతర భృతి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ గత పిఆర్సి బకాయిలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులు పై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు.

Exit mobile version