Uttam Kumar Reddy:ఎన్నికల ఫలితాలు వెల్లడించి కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (60 సీట్లు)కు మించి కాంగ్రెస్ సీట్లని సాధించినా సీఎం అభ్యర్థి విషయంలో మాత్రం ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అనే సంకేతాలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరుని నేరుగా ప్రకటించలేదు. దీంతో తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనే చర్చ సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.
మరి కొద్ది క్షణాల్లో తెలంగాణ సీఎం ఎవరనే దానిపై ప్రకటన రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పదవిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం పదవి విషయంలో తన అభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి చెప్పానన్నారు. సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని స్ఫష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ అన్ని ఆలోచనలు చేస్తుందని, నలుగురు.. ఐదుగురు రేసులో ఉండటం తప్పుకాదన్నారు.
అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పలేనని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో కీలక సమావేం కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకె శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు,. తెలంగాణకు కాబోయే సీఎం అభ్యర్థిపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపికపై కాసేపట్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.