UPSC Chairman : యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా

UPSC Chairman Manoj Soni
UPSC Chairman : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. మనోజ్ సోనీ రాజీనామాను రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు. పదవీకాలం ఐదేళ్లు మిగిలి ఉండగానే ఆయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2029లో ముగియనుంది. మనోజ్ సోని 2017లో కమిషన్ సభ్యుడిగా, 2024 మే 16న చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు.
గుజరాత్ లోని స్వామినారాయణ శాఖకు చెందిన అనుపమ్ మిషన్ కు ఎక్కువ సమయం కేటాయించడానికి ముందుగానే మనోజ్ సోనీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2020లో మిషన్ లో దీక్షను స్వీకరించిన తర్వాత మనోజ్ సోనీ కర్మయోగిగా మారారు. అయితే ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కేసులో బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.