Tigers : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు రేంజ్ పరిధిలో రెండు పులులు సంచరిస్తున్నట్లు గురువారం ఆయన తెలిపారు. వాటిలో ఒకటి రాపూరు పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందని అన్నారు. ఇది కర్నూలు టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితం వచ్చిందని వెల్లడించారు.
మరొక పులి గత ఏడాది సెప్టెంబరులో నల్లమల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడకు వస్తున్నాయని తెలిపారు. అవి సంచరించే ప్రాంతాల్లో నీటి కుంటలు, 18 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.