Online-Cheated: HDFC బ్యాంక్ లో జాబ్ కోసం 57,100 ఆన్ లైన్ లో చెల్లించిన ఇద్దరు అమ్మాయిలు…మోసపోయామని తెలిసి పోలీసులకు ఫిర్యాదు.

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలో ఒక అమ్మాయి తో పాటు కరీంనగర్ కు చెందిన మరో అమ్మాయి కి బ్యాంక్ జాబ్ పేరుతో ఆన్లైన్ మోసం జరిగింది.  HDFC  బ్యాంక్ లో జాబ్ ఇస్తామని చెప్పడంతో  ఇద్దరు స్నేహితులు కలిసి మొత్తం 57,100 డబ్బులు ఫోన్ పే ద్వారా దుండగుడికి వేశారు. మీరు అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. రిజిస్ట్రేషన్ ఫీస్ కట్టాలి అని మొత్తం 57,100 ఫోన్ ద్వారా కట్టించుకుని మరో లక్ష రూపాయల ఇద్దరు కట్టాలని చెప్పగా మోస పోయామని వారు గుర్తించారు.  దీంతో  నసురుల్లాబాద్ యువతీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం కోసం ఆన్లైన్ లో డబ్బులు కట్టాలంటే కట్టవద్దని యువతీ,యువకులు మోసపోవద్దని ఎస్ఐ లావణ్య తెలిపారు.

TAGS