TTD Chairman : ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పిక పైన సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు నెలల కాలంగా టీటీడీ ఛైర్మన్ పదవి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి రావడంతో పలువురు ప్రముఖులు ఈ పోస్టు కోసం పోటీపడ్డారు.
తాజాగా టీవీ 5 సంస్థల అధినేత బీఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్ గా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారంలోకి వచ్చిన సమయంలోనే ఆయనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తరువాత సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు, టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న మరో సీనియర్ నేత పేరుపైన చర్చ జరిగింది. అయితే, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, టీడీపీకి మద్దతుగా నిలిచిన ఆ మీడియా సంస్థల అధినేతకు ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.