సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తహసీల్దార్లు బదిలీలు ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తు న్న 30 మంది తహశీల్దార్లను పల్నాడు జిల్లా కు బదిలీలు చేస్తూ రెవెన్యు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ.. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఏపి లో పలు అధికారుల మార్పు చేర్పులు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో రెవెన్యూ శాఖ లో పనిచేస్తున్న యంఆర్ ఓలను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న మండల రెవెన్యూ అధికారులను బదిలీ చేస్తూన్నారు.
వినుకొండ – పి. బ్రహ్మయ్య ,
ఈపూరు – బి. దిలిప్ కుమార్ ,
బొల్లాపల్లి – బివి.రమణారావు,
నూజండ్ల – ఎండి.నయుమ్ అహ్మద్ లు తహసీల్దార్ లుగా నియామకం.