ఎన్నికల విధుల్లో పాల్గొనే విద్యాశాఖ అధికారులను బదిలీ చేయాల ఎలక్షన్ కమీషన్ తాజా గా ఉత్తర్వులు జారీచేసింది. వరుసగా మూడేళ్లు సర్వీస్ ఉన్న వారందరికీ తప్పనిసరి ఎన్నికల బదిలీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నోడల్ ఆఫీసర్స్ గా నియమించబడే డిఇఓ, డిప్యూటీ డిఇఓలకు తప్పనిసరి బదిలీ చెయ్యాయని ఎన్నికల కమీషన్ అధికారులు సూచించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఎన్నికల కమీషన్ బదిలీల ప్రక్రియ కు శ్రీకారం చు ట్టుంది. ఎన్నికల విధుల్లో పాల్గోనే విద్యాశాఖ అధికారులను వెంటనే బదిలీ చేయాలని ఎన్నికల కమీషన్ అదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అయా శాఖల ఉన్నాతాధికారులు తమ ఉద్యోగులను బదిలీ చేసే ప్రక్రియ మెదలు పెట్టినట్లు తెలుస్తుంది.