Train Accident : పట్టాలు తప్పిన ముంబై-హావ్ డా ఎక్స్ ప్రెస్.. ఇద్దరి మృతి
Train Accident : జార్ఖండ్ లోని చక్రధర్ పుర్ వద్ద ముంబై-హావ్ డా ఎక్స్ ప్రెస్ రైలు 18 బోగీలు పట్టాలు తప్పాయి. మంగళవారం తెల్లవారుజామున జంషెడ్ పూర్ కు 80 కి.మీ. దూరంలోని బారంబంబు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులుందరికీ ప్రాథమిక వైద్యం చేసిన సిబ్బంది, ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసి, కొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి కొంతదూరంలోనే మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ రెండు ప్రమాదాలూ ఒకేసారి జరిగాయా అనే దానిపై స్పష్టత లేదని అన్నారు.