Sankharavam Yatra : నేడు శంఖారావం రెండో విడత యాత్ర ప్రారంభం

Sankharavam Yatra, Nara Lokesh
ఏపీ : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావం రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రా రంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను లోకేష్ ప్రారంభిస్తారు.
ఈరోజు మడకశిర, పెనుగొండ లో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేష్ పర్యటిస్తారు అంతకుముందు శంఖారావం తొలివిడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది. రెండో విడతలో భాగంగా నారా లోకేష్ రాయలసీమ జిల్లాల్లో తన యాత్రను చేప ట్టనున్నారు. లోకేష్ చేస్తున్న శంఖారావం యాత్రకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడానికి టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.