JAISW News Telugu

CM Revanth Reddy: నేడు అసెంబ్లీ రెండో రోజు…సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిన్న తొలి రోజు గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఇవాళ ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇక రేపు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మెట్టమెదటి సారి అసెంబ్లీ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.   ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల తో పాటు సాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. మెత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version